విజయవాడ : నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా
కాళ్లు పట్టుకోవడం కోసం తిరుగుతున్నారని మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇప్పటికే
రాష్ట్రపతిని కలిసిన లోకేష్ తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని
అన్నారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదని అడిగేందుకు డిల్లీ
వెళ్లారని విమర్శించారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ
సిద్ధంగా లేరని.. అందుకే మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని
మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి
అనేక స్కాంలు చేశారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు
కదా. ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారని, రోడ్డు వేయకముందే
ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని విమర్శలు గుప్పించారు.
ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని
అన్నారు. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడని, కాళ్ళ నుంచి కళ్ళ
వరకూ భయంతో వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ‘రెడ్‌బుక్ రాసుకుంటానని
బెదిరిస్తున్న లోకేష్ సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు చేసుకోవాలి.
హెరిటేజ్‌లో 2 శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి
చెప్తున్నారు. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా. చంద్రబాబు అఫిడవిట్ ఆ
విషయం స్పష్టం చేశారా. కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం
ఇచ్చారు. అక్కడి నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది.
హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ. 600 కోట్లు.. భువనేశ్వరి లోకేష్ 118 కోట్ల
అయితే నోటీసులకు సమాధానం చెప్పాలి. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కామ్‌ల
గురించి తెలుసుకోవాలి. భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్
కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుంది. చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ
తెలుసు. చంద్రబాబు టీమ్ వర్క్‌గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం
అయినట్టు ప్రజలకు స్పష్టమైందని రోజా పేర్కొన్నారు.