విజయవాడ : జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను
ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే నిర్వహిస్తున్నామని ఎన్ టీ ఆర్
జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా
సవరణలో భాగంగా బుధవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ ఢిల్లీ రావు రాజకీయ
పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో
జరుగుతున్న ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇంటింటి
సర్వే సజావుగా నిర్వహించామని గుర్తించిన సమస్యలకు శాశ్వతమైన
పరిష్కారం చూపామన్నారు. గత బుధవారం నుండి నేటి వరకు జరిగిన సవరణ ప్రక్రియపై
రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు
నగర ప్రాంతాల్లో ఒకేచోట ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట, గేటెడ్ కమ్యూనిటీలలో
వెయ్యి కన్నా యెక్కువ మంది ఓటర్లు ఉన్న చోట అవసరమైతే వారికోసం ఒక పోలింగ్
స్టేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అటువంటి ప్రాంతాలు
ఉంటె అర్బన్ లోని కాలనీలు గీటెడ్ కమ్యూనిటీలు గుర్తించాలని అధికారులకు
తెలిపారు. సమావేశంలో వైయస్సార్సిపి పార్టీ ప్రతినిధి వై.ఆంజనేయ రెడ్డి,
తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎల్.శివరాం ప్రసాద్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
నుండి పి.ఏసుదాస్, సిపిఐ(ఎం) పార్టీ ప్రతినిధి డి.వి.కృష్ణ, బిజెపి పార్టీ
ప్రతినిధి ఎం.రమేష్ హాజరయ్యారు. సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ జి.వెంకటేశ్వర్లు
ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్ పాల్గోన్నారు