బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ బస్ స్టాండ్ అవార్డు గెలుచుకున్న డా. వై ఎస్ ఆర్
బస్ టెర్మినల్ * విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డు అందుకున్న
పులివెందుల డిపో మేనేజర్ రామకృష్ణ * ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా
అవార్డుల ప్రకటన *హాజరైన పర్యాటక శాఖా మంత్రి రోజా
విజయవాడ : ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
‘యాన్యువల్ టూరిజం ఎక్సెలెన్స్ అవార్డ్స్-2023’ అవార్డులను ప్రకటించింది. ఈ
అవార్డులలో ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ బస్ స్టాండ్’ అవార్డును పులివెందుల,
డా.వై.ఎస్.ఆర్. బస్ టెర్మినల్ సొంతం చేసుకుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళా
క్షేత్రంలో బుధవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పర్యాటక శాఖా
మంత్రి రోజా చేతుల మీదుగా పులివెందుల డిపో మేనేజర్ ఎస్. రామకృష్ణ, డిప్యూటీ
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోతురాజు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును
అందుకున్నారు. మొత్తం 40 వివిధ కేటగిరీలలో ప్రకటించిన అవార్డుల్లో ఏపిఎస్
ఆర్ టి.సి అవార్డు గెలుచుకోవడం హర్షణీయం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
చేతుల మీదుగా పులివెందులలో కొత్తగా డా. వై.ఎస్.ఆర్. బస్ టెర్మినల్ ఆధునిక
సదుపాయాలతో, సౌకర్యాలతో గత డిసెంబర్ నెలలో ప్రారంభించబడింది. ముఖ్యంగా
టూరిస్టుల అవసరాలకు అనుగుణంగా వేచియుండు ఏ/సి, నాన్ ఏ/సి విశ్రాంతి గదులు,
క్యాంటీన్లు, పర్యాటక ప్రాంతాల గురించి తగు సమాచారాన్ని తెలిపే ప్రత్యేక
బోర్డులు, సమాచార కౌంటర్, ప్రయాణీకుల కోసం ప్రతి ప్లాట్ ఫారం నందు కుర్చీలు
ఏర్పాటు చేయడం, సురక్షిత తాగు నీటి సౌకర్యం కల్పించడం, దూర ప్రాంతాల నుండి
వచ్చే యాత్రికులు, ప్రయాణీకుల కోసం డార్మిటరీ, టాయిలెట్స్, లగేజి కౌంటర్లు
మొదలైన సౌకర్యాలు కల్పించడం, ప్లాట్ ఫారంల పరిశుభ్రత, ఆహ్లాదకరంగా బస్
స్టేషన్ని తీర్చిదిద్దడం, ప్రీ పెయిడ్ టాక్సీ / ఆటో సర్వీసుల దగ్గరలోనే
అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు, ఇంకా దివ్యాంగులకు, విద్యార్ధులకు, మహిళలకు
ఇతరత్రా మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి విశేష సేవలు అందిస్తున్నందున
పులివెందులలోని డా. వై. ఎస్. ఆర్. బస్ టెర్మినల్, బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ
బస్ స్టాండ్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డు రావడం పట్ల సంస్థ ఎం. డి
సిహెచ్. ద్వారకా తిరుమల రావు ఆనందం వ్యక్తం చేసి, అవార్డు అందుకున్న
అధికారులను అభినందించారు.