హైదరాబాద్ : రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న
పథకాలను ప్రవేశ పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లీం,
క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ది కోసం బడ్జెట్ లో పెద్ద మొత్తంలో కేటాయింపులు
చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క 2023 – 2024 ఆర్ధిక సంవత్సరానికిగాను
తెలంగాణ ప్రభుత్వం రూ. 2200.33 కోట్లను కేటాయించింది. వారికి ఆర్ధిక
చేయుతనిచ్చేలా పథకాల రూపల్పన చేసింది. విదేశాలలో చదువుకునే మైనారిటి
విద్యార్ధులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట ప్రోత్సాహకాలు అందింస్తోంది.
మైనారిటీ యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు మైనారిటీ రెసిడెన్షియల్
స్కూల్ లతో పాటు తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిల్ లను నిర్వహిస్తోంది.
షాదీ ముబారఖ్ పేరిట ముస్లీం పెద ఆడపిల్లల పెళ్లిల్లకు గడిచిన 9 ఏళ్ళలో 2
లక్షల 68 వేల మందికి రూ. 2,258.17 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది ఆర్ధికంగా
చేయుత నిచ్చింది. క్రిస్టియన్ మైనారిటీలకు క్రిస్టియన్ భవన్
నిర్మించుకునేందుకు ఉప్పల్ భాగ్ హయత్ లో 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు భవణ
నిర్మాణానికి అయ్యే నిధులను సమకూర్చింది.
షాదిముభారఖ్ తో సంతోషాల వెల్లువ: ఆర్ధక స్థితిగతుల కారణంగా ముస్లీం మైనారిటీలు
వారి ఆడపిల్లల వివాహాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తెలంగాణ
ప్రభుత్వం షాదిముభారఖ్ స్కీం ను ప్రకటించింది. ఈ పథకం ద్వారా 2014 సంవత్సరంలో
ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ. 51 వేల రూపాయలను ఆర్ధికసాయంగా అందించింది. ఆ
మొత్తం కూడా వివాహ ఖర్చులకు సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం దశల వారిగా ఆ
మొత్తాన్ని రూ.1,00,116 లకు పెంచింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి 2023
సంవత్సరం వరకు షాదిముభారఖ్ క్రింద 2,68,230 మంది లబ్ధిపొందారు. ఇందుకుగాను
ప్రభుత్వం రూ. 2465 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
స్వయం ఉపాధికి రూ.లక్ష సాయం: నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్న మైనారిటి యువతకు
చేయుత నిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ
కేంద్రాలలో మైనారిటీ నిరుద్యోగులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారు స్వయం
ఉపాధి కల్పించుకునేలా తయారు చేస్తోంది. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటి
యువత స్వయం ఉపాధి కోసం వంద శాతం సబ్సీడితో లక్షరూపాయల ఆర్ధకసాయం
ప్రకటించింది. 2023 – 2024 సంవత్సరం నాటికి రూ.554.07 లక్షల రూపాయలు వెచ్చించి
3110 మంది క్రిస్టియన్ మైనారిటి యువకులకు ఐటి మరియు ఇతర రంగాలలో శిక్షణ ఇచ్చి
స్వయం ఉపాధి కల్పించింది. ఓన్ యువర్ ఆటో పేరిట రూ.12.76 కోట్ల సబ్సీడితో 1744
మంది మైనారిటి నిరుద్యోగులకు ఆటోలను అందచేసింది. డ్రైవర్ ఎంపవర్మెంట్
ప్రోగ్రామ్ ద్వారా రూ.31.97 కోట్ల సబ్సీడితో 709 మందికి క్యాబ్ లను
అందచేసింది. మైనారిటి మహిళల స్వయం ఉపాధికోసం రూ. 08.03 కోట్ల వ్యయంతో 10,072
కుట్టుమిషన్ లను పంపిణీ చేసింది.
రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటి స్టడీసర్కిల్ ద్వారా నాణ్యమైన విద్యాభోదన:
మైనారిటి యువకులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు రాష్ట్రంలోని 204
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మార్చింది. ఈ కళాశాలలకు
రూ.788.66 కోట్లరూపాయలను మంజూరు చేయగా రూ.649.07 కోట్లు ఖర్చుచేసింది. ఈ
కళాశాలలో మైనారిటి విధ్యార్ధులకు విద్య, నివాస, భోజన వసతులు కల్పిస్తారు.
ఉన్నత విద్య అనంతరం ప్రభుత్వ, ఫ్రైవేటు రంగ పోటి పరిక్షలకు మైనారిటి స్టడీ
సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తారు. మైనారిటి స్టడిసర్కిల్ ద్వారా తెలంగాణ
ఏర్పడిన నాటి నుండి 2023 వ సంవత్సరం వరకు 9319 మంది విద్యర్ధులు శిక్షణ
పొందారు. ప్రతియేట మైనారిటి స్టడీ సర్కిల్ నిధుల ద్వారా 100 మంది విద్యార్ధులు
పేరుగాంచిన ఐఏఎస్ స్టడిసర్కిల్ లలో శిక్షణ పొందుతున్నారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్: విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే
మైనారిటీ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ను
ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్ధికి 20 లక్షల రూపాయల
ఆర్ధికసాయంతో పాటు ఒక వైపు విమాన ప్రయాణ ఖర్చులను 60 వేల రూపాయలకు మించకుండా
ప్రభుత్వమే బరిస్తోంది. ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి
2023 సంవత్సరం వరకు 2210 మంది విద్యార్ధులు లబ్దిపొందారు. 2023 – 2024 ఆర్ధిక
సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 118 కోట్లను కేటాయించగా రూ. 59
కోట్లను ఖర్చు చేసింది.
పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన
తరువాత మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు
చేసింది. ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయి అధికారులు సంక్షేమ పథకాల అమలును
పర్యవేక్షిస్తారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూస్తారు. అవగాహన లేని
వారికి అవగాహణ కల్పించి వారు సంక్షేమ ఫలితాలు పొందేలా చర్యలు తీసుకుంటారు.
రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఈ సంక్షేమ పథకాలు అందేలా ఉన్నతాధికారుల బృందం
పర్యవేక్షణ చేస్తుంది. ఈ కమిషనరేట్ మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
అనీస్ ఉల్ ఘుర్బా భవన నిర్మాణం : ముస్లిం అనాథలకోసం తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదులో 39 కోట్లతో అనీస్ ఉల్ ఘుర్భా భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది.
నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.
ఆజ్మీర్ లో రుబాత్(అతిథి గృహం) : ముస్లింల పవిత్ర దర్గా రాజస్థాన్ లోని
అజ్మీర్ వద్ద తెలంగాణనుంచి సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రుబాత్ (అతిథి
గృహం) నిర్మించేందుకు రూ. 5 కోట్లు కేటాయించింది. భూమి సమీకరణకు సంబంధించి
అజ్మీర్ డెవలప్ మెంట్ అథారిటిని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించింది.
ఇమాం మౌజంలకు గౌరవ వేతనం : ముస్లింల ప్రార్థనా స్థలాలు అయిన మసీదులు,
మదర్సాల్లో ఉండే ఇమామ్, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,000 ల
గౌరవ వేతనాన్ని అందిస్తున్నది. రాష్ట్రంలోని 10 వేల మందికి ఈ గౌరవ వేతనాన్ని
అందిస్తూ సమాజంలో వారికి గౌరవప్రదమైన హోదాను, గౌరవాన్ని కల్పిస్తున్నది.
ఇతర కార్యక్రమాలు : పాతబస్తీలోని మక్కా మసీదు మరమ్మత్తులు, పునరుద్ధరణ,
నవీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 8.48 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులు దాదాపు
పూర్తయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కొత్తూర్ లోని జహంగీర్
పీర్ దర్గా సమగ్రాభివృద్ధికి అవసరమైన భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50
కోట్లను ఖర్చు చేసింది. హైదరాబాద్ లోని కోకాపేట్ లో బర్హానా షా సాహిబ్ ఖిబ్లా
పరిసరాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, మహిళా సాధికారత కేంద్రం స్థాపనకు
ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది. హైదరాబాద్ లోని కోకాపేటలో రూ. 40
కోట్లతో తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ స్థాపనకు రూ. 40 కోట్లు
మంజూరు చేశారు. డ్రైవర్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రామ్ కింద మైనార్టీ ఫైనాన్స్
కార్పోరేషన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ లు 941 కార్లను మైనార్టీలకు
పంపిణీ చేశాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్
స్కూళ్ళ సంఖ్య 12, టీచర్ల సంఖ్య 258, విద్యార్థుల సంఖ్య 5760 ఉండగా, తర్వాత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 192 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించడంతో
పాటు 5,862 మంది టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 204 కాగా, టీచర్ల సంఖ్య 6120. మొత్తం
97,920 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు
ముందు రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కేవలం 2 మాత్రమే
ఉండేవి. వీటిలో విద్యార్థుల సంఖ్య 320 ఉండగా, 28 మంది టీచర్లు పనిచేసేవారు.
తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 202 మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలను
స్థాపించడంతో పాటు 1,616 మంది టీచర్లను నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో
మొత్తం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సంఖ్య 204 కాగా, వీటిలో టీచర్ల
సంఖ్య 1644 గా ఉంది. 32,640 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు.