కీవ్ : ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు
సిద్ధంగా ఉన్నారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. పలువురు
అమెరికా పారిశ్రామిక వేత్తలు ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత
వ్యక్తం చేశారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన
వెంటనే అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామని అన్నారు. వారం రోజులపాటు
జెలెన్ స్కీ అమెరికా, కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు
వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. తన పర్యటన వివరాలపై జెలెన్ స్కీ ఆదివారం
మాట్లాడుతూ మెకేల్ బ్లూమ్‌బర్గ్, లారీ ఫింక్, బిల్ అక్మాన్ వంటి
వ్యాపారవేత్తలు సైతం ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని
చెప్పారు. రష్యాతో యుద్ధం ముగిసిన వెంటనే అది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం
చేశారు. ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని జెలెన్ స్కీ
తెలిపారు. వ్యాపార విస్తరణ నిమిత్తం తమ దేశానికి వచ్చే వ్యాపారవేత్తలకు భద్రతా
హామీల రసీదు ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ విజయం,
పునర్మిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. అమెరికా, కెనడాలో పర్యటించిన
జెలెన్ స్కీ ఆ దేశాలను మిలటరీ, ఆర్థిక సాయం కోరారు. మాస్కో కీవ్‌పై దండయాత్ర
మొదలుపెట్టి 19 నెలలు గడుస్తున్నా.. యుద్ధం ముగిసే సూచనలు కన్పించడం లేదు. ఈ
నేపథ్యంలో జెలెన్ స్కీ పెట్టుబడుల గురించి వ్యాఖ్యానించడం గమనార్హం.