తన ముంబై ఇంటి వెలుపల ఆదివారం సమావేశం తక్కువ ఉత్సాహంగా మారిందని అమితాబ్ బచ్చన్ తన తాజా బ్లాగ్లో వెల్లడించారు. తనలాంటి నటుల ఉత్సాహం కేవలం మొబైల్ ఫోన్లు, కెమెరాలకే పరిమితమని అభిప్రాయపడ్డారు. ఆదివారం సమావేశాల ప్రాముఖ్యతను, దానిని తన అభిమానులు ‘దర్శన్’ అని ఎందుకు పిలుస్తారో కూడా వివరించారు. అభిమానులను పలకరించే ముందు తాను ఎప్పుడూ తన బూట్లు విప్పి, వారి పట్ల “భక్తి”తో నడుచుకుంటానని చెప్పారు.
“సంఖ్యలు తక్కువ పరిమాణంలో ఉన్నందున ఉత్సాహం తగ్గిపోయి, ఆనందపు అరుపులు ఇప్పుడు మొబైల్ కెమెరాకు బదిలీ చేయబడ్డాయని నేను గమనిస్తున్నాను.. ఇది ఇప్పుడు సమయం మారిందని సూచిస్తుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు.” అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.