భద్రాద్రి కొత్తగూడెం : సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన
ఆరోపణలు చేశారు. సింగరేణి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రభుత్వం
సిద్ధమా? అని సవాల్ విసిరారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్‌ల వేలంలో
సింగరేణి పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కోయాగూడెం బ్లాక్ అరబిందో
శరత్ చంద్రారెడ్డి కి కట్టబెట్టి లబ్ది పొందారని ఈటల ఆరోపించారు. ఉద్యమ సమయంలో
ఉత్తర తెలంగాణను బొందలగడ్డ గా మార్చారన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక 12 నుంచి 20
ఓపెన్ కాస్ట్ గనులు ఎలా ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. కేసీఅర్ అవినీతి పాలన
ప్రజల్లోకి వెళ్ళకుండా చానల్స్ పత్రికల యాజమాన్యాలను కబ్జా చేశారన్నారు.
యూట్యూబ్ చానల్స్ వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఈటల అన్నారు.