హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా
ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు. చంద్రబాబును అరెస్టు
చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాద్‌లో
మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ‘జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే
బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. దళితులపై ఇన్ని ఘోరాలు
గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి. జగన్ వైఖరిని
ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైలులో
పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వైఎస్ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదు.
దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు.
పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపారు. ప్రజల కోసం ఐదేళ్లలో
బడ్జెట్లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి
వ్యక్తి ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా? ’’ అని ఏపీ ప్రభుత్వాన్ని
మోత్కుపల్లి నిలదీశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌లో
నిరసన దీక్ష చేపడతానని, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి తెలిపారు.