తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం
మోడీ..తెలంగాణ విరోధి అంటూ ట్వీట్
పదేపదే విషం చిమ్ముతున్నారని విమర్శ
తెలంగాణ పట్ల చులకన భావం ఎందుకని ప్రశ్న
తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని
కలిగించాయని తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను
ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బతీస్తున్నారన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ
వేడుకలు జరుపుకోలేదనడం సరికాదని, ఇది అజ్ఞానానికి,అహంకారానికి నిదర్శనమన్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మోడీ తెలంగాణ విరోధి
అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు. అంతకుముందు, కాంగ్రెస్ అర్ధ శతాబ్ధపు పాలన
మోసం.. వంచన.. ద్రోహం.. దోఖాలమయం.. అంటూ విమర్శలతో ట్వీట్ చేశారు.