విజయవాడ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్
యస్.ఢిల్లీ రావు ప్రశాంతి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని ఆయన
నివాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజలు నిర్వహించారు. జిల్లా
కలెక్టర్ గృహం ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన మంటపంలో వినాయకుడు మట్టి
విగ్రహాన్ని ఏర్పాటు చేసి వేద పండితులు కలెక్టర్ దంపతులచే ప్రత్యేక పూజలు
చేయించారు. అనంతరం వినాయక వ్రతం పూర్తి చేసుకున్న కలెక్టర్ దంపతులు విశ్వ
సృష్టికి అధినాయకుడు విఘ్నాలు తొలగించే విగ్ననాధుని దీవెనలతో ప్రతి ఒక్కరూ
ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు, పాడి పంటలతో జీవించాలని
ప్రార్ధించామన్నారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాలలో ఎటువంటి
విఘ్నాలు లేకుండా విజయాలు సాధించేలా ఆశీస్సులు అందజేయమని విజయ గణపతిని
కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమం లో జిల్లా కలెక్టరు తల్లి
ఎస్.పార్వతి, కలెక్టర్ సతీమణి ప్రశాంతి తల్లిదండ్రులు పి. బుచ్చయ్య పి.సుజాత,
కుమారుడు ఎస్. జివితేష్ కుమార్తె సిరి చందన కలెక్టర్ కార్యాలయ సిబ్బంది
పాల్గొన్నారు.