తరపున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి రాష్ట్ర అటవీ, విద్యుత్,
పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి దంపతులు
పట్టు వస్త్రాలు సమర్పించారు.
వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం కాణిపాకం లో స్వయంభు శ్రీ వరసిద్ధి
వినాయక స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీ, విద్యుత్,
పర్యావరణ,శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామ
చంద్రారెడ్డి, సతీమణి స్వర్ణలత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి
తో పాటు చిత్తూరుపార్లమెంటు సభ్యులు ఎన్. రెడ్డప్ప,కలెక్టర్ ఎస్.షన్మోహన్,
పూతల పట్టు, పలమనేరు శాసన సభ్యులు ఎం.ఎస్. బాబు, వెంకటే గౌడ్ తదితరులు
ఉన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి విచ్చేసిన మంత్రి
ఎంపీ,కలెక్టర్, శాసన సభ్యులు లకు కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ
వెంకటేశు స్వాగతం పలికారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినఅనంతరం
స్వామివారి కల్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామి వారి వ్రత కల్పంలో భక్తి
శ్రద్ధలతో పాల్గొని మంత్రి, ఎంపి, కలెక్టర్, శాసన సభ్యులు స్వామి వారి తీర్థ
ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం
చేసి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను మంత్రి, ఎంపీ, కలెక్టర్,
శాసనసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ
జోనల్ చైర్మన్ శైలజా రెడ్డి, చిత్తూరు ఆర్డీఓ రేణుక, తహసిల్దార్ సుశీల,
ఎంపీడీఓ నాగరాజు ,ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి రవీంద్రబాబు, హరి
మాధవరెడ్డి, ఆలయ అధికారులు, వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు.