కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల హోదాపై బిల్లు ఈ విడత
సమావేశాల్లో మళ్లీ చర్చకు రానుంది. సీఈసీ, ఈసీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి
హోదాలో ఉన్నారు. దీనిని కేబినెట్ కార్యదర్శి స్థాయికి తగ్గించేందుకు
ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో
ప్రవేశపెట్టారు. దానిపై విపక్షం అప్పుడే పెద్దఎత్తున నిరసన గళం వినిపించింది.
ఈ బిల్లుతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే అంశాన్ని చర్చకు
తీసుకురావచ్చని భావిస్తున్నారు. తగిన సమయంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం
తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ
సమావేశానంతరం చెప్పారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు, పత్రికల బిల్లు, పోస్టాఫీసు
బిల్లు, వృద్ధుల సంక్షేమం వంటి ఎనిమిది అంశాలు పార్లమెంటు ముందుకు
రానున్నాయి.news description