వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న
రిపబ్లికన్ పార్టీ నేత, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి హెచ్-1బీ
వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే ఈ వీసాల జారీలో లాటరీ
విధానానికి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానాన్ని అమలు చేస్తానని హామీ
ఇచ్చారు. ప్రస్తుత విధానంలో వీసాలు స్పాన్సర్ చేసే కంపెనీకే ఎక్కువ లబ్ధి
కలుగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికన్ సంస్థలు సాంకేతిక నిపుణులైన
విదేశీయులకు హెచ్-1బీ వీసా అందించడం ద్వారా ఉద్యోగాల్లో నియమించుకుంటాయి.
భారత్, చైనాల నుంచి ఎక్కువ మంది ఈ వీసా సాయంతోనే అమెరికాలో ఉద్యోగాలు
పొందుతారు. ఒకప్పుడు రామస్వామి యజమానిగా ఉన్న రోవియంట్ సైన్సెస్ సంస్థ
విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్-1బీ వీసా ప్రోగ్రాంను 29 సార్లు
ఉపయోగించుకుందని ఒక కథనం పేర్కొంది.