బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు
సాంప్రదాయ చేతివృత్తి కళాకారులకు సన్మానం
విజయవాడ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు
వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, విశిష్ఠ అతిధిగా
కేంద్రమంత్రి భగవంత్ కుబా హాజరయ్యారు. విశ్వకర్మ జన్మదినం ఇదే రోజు కావడంతో
శ్రీ విరాట్ విశ్వకర్మ పూజ ను నిర్వహించారు ఈ సందర్భంగా సాంప్రదాయ చేతివృత్తి
కళాకారులకు సన్మానం నిర్వహించారు. బిజిపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురంధేశ్వరి ప్రారంభోపన్యాసం చేస్తూ హస్తకళల అభివృద్ధి లో భాగంగా స్కిల్
డెవలప్మెంట్ అందించడం ఈ స్కిం ఉద్దేశం. బిజెపి పేదల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ
కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రతీ పేద
వాడికీ 5 లక్షలు అందిస్తుందని, ఆరోగ్యశ్రీ మాత్రమే ఏపీలో అమలులో ఉంది.
ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదు. ఆయుష్మాన్ భవ కార్డును పేదలకు
అందిస్తున్నాం. దీనితో దేశంలో ఎక్కడైనా వైద్యసేవలు పొందవచ్చు. బిజెపి
కార్యకర్తలు ప్రజలందరికీ ఆయుష్మాన్ భవ కార్డులను అందించే ప్రక్రియలో
భాగస్వాములౌతున్నారని ఆమె వివరించారు. నేటి నుండి గాంధీ జయంతి వరకూ ఈ సంక్షేమ
కార్యక్రమాలు జరుగుతాయ, ని ప్రతి రోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తా మని
చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని, బిజెపి శ్రేణులు
అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
దేశానికి ప్రధాన సేవకుడ్ని అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ బిజెపి
సేవాకార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఒకే
రోజు ప్రధాని జన్మదిన వేడుకలు, విశ్వకర్మ జయంతి ఒకే రోజు జరుపుకోవడం
సంతోషకరమన్నారు. సాంప్రదాయ వృత్తుల వారికి ప్రధాని నరేంద్ర మోడీ అండగా
ఉండేందుకు విశ్వకర్మ యోజన పధకాన్ని ప్రారంభిస్తున్నారన్నారు.
కేంద్రమంత్రి భగవంత్ కుబా విశిష్ట అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అందరికి
విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ
కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత సనాతన కాలం నుంచీ హిందూ
జీవన పద్దతి వసుధైవ కుటుంబంగా మన నినాదం అని అందరికి తెలుసన్నారు. గత
తొమ్మిదేళ్ళలో మోడీ ప్రభుత్వ పధకాలతో 13.5 కోట్ల పేదల స్ధితిగతులు మారాయని ఈ
సందర్భంగా కేంద్రమంత్రి భగవంత్ కుబా స్పష్టం చేశారు. దేశ ఆర్ధికస్ధితిని
మెరుగుపరచడానికి ఎదిగిన పేదలు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. చేతివృత్తుల
వారిని సమాజ నిర్మాణం చేసేవారుగా చూసారు నరేంద్ర మోడీ. విశ్వకర్మ సమాజం
సంఖ్యలో చిన్నదేమో కానీ వృత్తుల విషయంలో అతిపెద్దదన్న విషయం గ్రహించాలన్నారు.
విశ్వకర్మ యోజన ద్వారా లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. విశ్వకర్మ సమాజం
చేసే వస్తువులకు తయారీ నుంచీ మార్కెట్ లో అమ్ముడయ్యే వరకూ పూర్తి సహకారం
అందించేది విశ్వకర్మ యోజన అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయల నుంచీ 3 లక్షల వరకూ
రుణ సదుపాయం విశ్వకర్మ యోజన ద్వారా అందిస్తామన్నారు. 13 వేల కోట్ల నిధులు ఈ
విశ్వకర్మ యోజన కు కేటాయించడం జరుగుతుందన్నారు 35 లక్షల చిన్నచిన్న చేతి
వ్రుత్తుల వారి కి ఈ పధకం ఉపయోగపడుతుందన్నారు. విశ్వకర్మసమాజాన్ని స్వాలంభన,
స్వాభిమాన జీవనం కోసం విశ్వకర్మ యోజన పధకం వారికి అండగా ఉంటుందని, ప్రధాన
మంత్రి నరేంద్ర మోడీ సమాజంలో ఉన్న నిర్మాణ, శిల్పిలకు అండగా ఉన్నారన్న
విషయాన్ని వివరించారు బ్యాంకుల నుండి సబ్సిడీ రుణాలు తీసుకోవడానికి మార్గం
సులభతరం చేయడంతో పాటు విశ్వకర్మయోజన పధకం ద్వారా అనేక రకాల లబ్ధి చేకూరుతందని
వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు
అధ్యక్షత వహించారు. సమావేశంలో బిజెపి రాష్ట్రప్రధాన కార్యదర్శి బిట్ర
శివన్నారాయణ, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి అధికార
ప్రతినిధి లంకా దినకర్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ
తదితరులు వేదికను అలంకరించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల
మీదుగా విశ్వకర్మయోజన పధకం ప్రారంభ కార్యక్రమాన్ని ఎల్ఇడి స్క్రీన్ ద్వారా
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో సహా బిజెపి నేతలు అంతా
వీక్షించారు.