40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశాం
2021 నాటికి 2.32లక్షల మంది నైపుణ్యం సాధించారు
ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి, మనీ లాండరింగ్ జరగలేదు
సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్
న్యూఢిల్లీ : స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారమైందని సీమెన్స్ కంపెనీ మాజీ
ఎండీ సుమన్ బోస్ అన్నారు. ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని, దీనిలో
ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అరెస్ట్ తదితర పరిణామాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా
సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ
కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. 2014లో రాష్ట్ర
విభజన జరిగినపుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్
కోసం ముందుకొచ్చింది. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. 2021
నాటికి 2.32లక్షల మంది నైపుణ్యం సాధించారు. వారికి సర్టిఫికేషన్ ఇవ్వడంతో
ఉద్యోగాలు చేస్తున్నారు. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని
చెప్పారు.
గతంలో మెచ్చుకున్న ఏపీఎస్ఎస్డీసీ (ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్) ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించింది. ఒక్క కేంద్రాన్నీ
సందర్శించలేదు. ఎక్కడా తనిఖీ చేయకుండా అక్రమాలు జరిగాయంటున్నారు. ఇలా ఎందుకు
జరిగిందన్నది పెద్ద మిస్టరీ. ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి, మనీ లాండరింగ్
జరగలేదు. సీమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి మధ్య
ఒప్పందం ఉంది. అన్నీ అధ్యయనం చేసిన తర్వాతే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. అది
విజయవంతమైంది. ఒక సాఫ్ట్‌వేర్‌పై యువతకి అవగాహన కల్పించినపుడు ఆ దానికి
డిమాండ్ పెరుగుతుంది. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సీమెన్స్‌పై
చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇదే తరహా
ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో
ఉన్నందున అన్ని విషయాలు అక్కడే చెబుతామ ని సుమన్ బోస్ అన్నారు. స్కిల్
డెవలప్మెంట్ స్కీమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన దీమాగా చెప్పారు.
ప్రాజెక్ట్ అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలని అన్నారు.
అందుకే మీడియా ముందుకొచ్చా : స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారమైనదన్నారు.
తాను మీడియా ముందుకు రావడానికి కారణం జీవితంలో తాను సంపాదించుకున్నది
గౌరవాన్నని వ్యాఖ్యానించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు వ్యవసాయ
రాష్ట్రంగా ఉన్నపుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్
డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చిందన్నారు.2021లో స్కిల్ డెవలప్మెంట్ బాగా
జరిగిందన్న లెటర్ కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా
అందుకున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి లేదని, అన్ని
అధ్యయనం చేసిన తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభించామని సుమన్ బోస్ వివరించారు. ఏపీ
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? అని ప్రశ్నించారు.
మనీ లాండరింగ్ జరగలేదని, సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వ ఏపీ స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్‌కి మధ్య ఒప్పందం ఉందని చెప్పారు. ఒక సాఫ్ట్ వేర్‌పై యువతకి అవగాహన
కల్పించినప్పుడు ఆ సాఫ్ట్ వేర్కి డిమాండ్ పెరుగుతుందని, మార్కెటింగ్ లో
భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.