నిజామాబాద్ : నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ జాతీయ
సమైక్యతా వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, త్రివర్ణ పతాకాన్ని
ఆవిష్కరించారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్టీసీ ఛైర్మన్
బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్
గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ
కార్పొరేషన్ ఛైర్మన్ డి.రాజేశ్వర్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అదనపు
కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు,
ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామ పంచాయతీలకు
మంత్రి చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డులు బహూకరించారు. ఈ
వేడుకలను పురస్కరించుకుని ఐడిఓసి వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.