ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు
తొలుత వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళి
అనంతరం, జాతీయ జెండా ఆవిష్కరణ
నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనం : అమిత్ షా
హైదరాబాద్ : నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు తెలంగాణ విమోచన దినోత్స
వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. విమోచన పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు వార్ మెమోరియల్ వద్ద
నివాళులు అర్పించారు. అనంతరం, అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ
తరువాత, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల
దేశభక్తికి నిదర్శనమని అమిత్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో
అమిత్ షాతో పాటూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.