బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి : బిజెపి రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
జన్మదినోత్సవం తోపాటు విశ్వకర్మ జయంతి వేడుకలు కూడా 17వ తేదీ ఆదివారం
సంయుక్తంగా బిజెపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చేయనున్నారు. విశ్వకర్మ యోజన
పధకం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ ఇడి స్క్రీన్ ల ద్వారా వీక్షించేందుకు అనేక
ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇద్దరు కేంద్ర
మంత్రులు ఆంద్రప్రదేశ్ కు వస్తున్నారు. విశాఖపట్టణానికి కేంద్రమంత్రి
దేవుసిన్హ్ చౌహాన్ చేరుకుని ఆదివారం ఉదయం 9.20 నిమిషాలకు బీచ్ రోడ్డులోని
పాండురంగస్వామి టెంపుల్ కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ
సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ
సందర్భంగా సాంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారుల పేరిట కూడా పూజలు
నిర్వహిస్తారు. అనంతరం పోర్టు సాగరమాల ఆడిటోరియంకు చేరుకుని అక్కడ విశ్వకర్మ
యోజన పధకానికి సంబందించిన కార్యక్రమంలో పాల్గొంటారు.
విశాఖ బిజెపి కార్యాలయంలో బిజెపి నేతలతో ప్రత్యేక భేటీ అవుతారు అదే రోజు
సాయంత్రం 4గంటలకు బీచ్ రోడ్డులో వైంఎంసిఎ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్
ను ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్ లో తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనకు
సంబందించిన ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తారు. విజయవాడలో కేంద్రమంత్రి భగవంత్ కుబా
ఆదివారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ పేట లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో
రైల్వే ఫంక్షన్ హాలులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాంప్రదాయ వృత్తి
కళాకారుల సమావేశంలో పాల్గొని విశ్వకర్మ యోజన పధకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన
ముఖ్యఅతిధిగా పాల్గొంటారు. ఇదే సందర్భంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు
దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్రమంత్రి భగవంత్ కుబా లు కలసి ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు, విశ్వకర్మ యోజన పధకం కార్యక్రమాల్లో
పాల్గొంటున్నారు ఈవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగే
నరేంద్రమోదీ జన్మదినోత్సవ వేడుకలు, విశ్వకర్మ యోజన పధకం కార్యక్రమాల్లో
బిజెపి రాష్ట్ర నేతలు హాజరవుతున్నారు.