కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ * ఢిల్లీ నుండి కార్యదర్శుల కమిటీతో కలిసి
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం
* పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి
విజయవాడ : త్వరలో జరగనున్న 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం సన్నాహక చర్యల్లో
భాగంగా శనివారం ఢిల్లీ నుండి కార్యదర్శుల కమిటీతో కలిసి కేబినెట్ కార్యదర్శి
రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశంలో స్వచ్చత హీ సేవా అనే థీమ్ అంశంపై సిఎస్ లతో ఆయన చర్చించారు. ఈ
సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ గార్బేజ్ రహిత ఇండియాగా
దేశాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా ఈనెల 15 నుండి అక్టోబరు 2 వ
తేదీ వరకూ ‘స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని’ నిర్వహిస్తున్నట్లు
తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మొదలు అన్నిశాఖల అధికారులు,
సిబ్బంది,సీనియర్ సిటిజన్లు, ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం
చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తదుపరి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శులతో ఈ. కార్యక్రమం అమలుపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
చర్చించారు. విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్. జవహర్ రెడ్డి ఈవీడియో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన సంబంధిత
శాఖల అధికారులతో మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంపై మాట్లాడుతూ ఈనెల 15
నుండి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో
నిర్వహించే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని
ఆదేశించారు. ఈనెల 17వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈస్వచ్ఛత హీ
కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు మొదలు అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఇతర ప్రముఖు,
ప్రజలు,సంస్థలు సహా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని నగరాలు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్ళు, ప్రజోపయోగ స్థలాలు, పాఠశాలలు,
అంగన్వాడీ కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీ
కార్యాలయాల పరిసరాల్లో పూర్తి స్థాయిలో పరిశుభ్రతను పాటించాలని సిఎస్ జవహర్
రెడ్డి ఆదేశించారు.అదే విధంగా బస్ స్టాండ్లు,రైల్వే స్టేషన్లు, నదులు ప్రక్కన
ఘాట్లు,బీచ్లు, జూ పార్కులు,ప్రార్థనా స్థలాలు ప్రాంగణాలు,పర్యాటక, చారిత్రక
మాన్యుమెంట్ ప్రదేశాలు,పలు మార్కెట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశుభ్రత
చర్యలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.గ్రామాలు, పట్టణాల్లో
పెద్ద ఎత్తున పరిశుభ్రతా డ్రైవ్ చేపట్టాలని చెప్పారు.డ్రైన్లు,పల్లాలు క్లీన్
చేయడం,ముఖ్య కూడళ్ళలో మానవహారం ఏర్పాటు, మారథాన్లు నిర్వహణ వంటి చర్యలు
తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులను
ఆదేశించారు. అలాగే యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువజన బృందాలతో పరిశుభ్రతపై
ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.వైద్య ఆరోగ్య శాఖ
ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు,క్లాప్ మిత్రలకు హెల్తు చెకప్ క్యాంపులు
నిర్వహించాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో
స్వచ్ఛత ప్రతిజ్ఞలు,స్వచ్ఛత పరుగు,క్విజ్,శానిటేషన్ క్లబ్లు ఏర్పాటు తోపాటు
పాఠశాలలు ప్రాంగణాల్లో మొక్కలు నాటడం,పరిశుభ్రతను పెంపొందించడంపై పలు
సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు. ఈస్వచ్ఛత హీ సేవా
కార్యక్రమాల్లో భాగంగా 17వతేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య
కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 2వ తేదీన సభలు నిర్వహించి
ఒకసారి వినియోగించి పడవేసే ప్లాస్టిక్ వస్తువుల(సింగిల్ యూజ్ ప్లాస్టిక్)ను
పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేయాలని సిఎస్ స్పష్టం చేశారు. ఈసమావేశంలో
పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఐటీశాఖ కార్యదర్శి
కె.శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, స్వచ్ఛాంధ్రప్రదేశ్
కార్పొరేషన్ ఎండి జి.చంద్రుడు, వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జె.నివాస్, సెర్ప్
సిఇఓ ఇంతియాజ్,ట్రాన్సుకో జెఎండి చక్రధర్ బాబు, సిడిఎంఏ
కోటేశ్వరరావు,గృహనిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీ షా,ఐటీశాఖ జెఎస్ సుందర్,ఇఎఫ్ఎస్టి
ప్రత్యేక కార్యదర్శి డా.చలపతి రావు తదితర అధికారులు పాల్గొన్నారు.