3782 మందితో పోలీస్ సిబ్బందితో బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత
ఏర్పాట్లను పర్యవేక్షించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
తిరుమల : సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు,
అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
తెలిపారు. మొదటగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబరు
18న ధ్వజారోహణం, సెప్టెంబరు 22న గరుడ వాహనం, సెప్టెంబరు 23న స్వర్ణరథం,
సెప్టెంబరు 25న రథోత్సవం(మహారథం), సెప్టెంబరు 26న చక్రస్నానం,
ధ్వజావరోహణం జరుగుతుందన్నారు. 18వ తేది నుండి 26వ తేది వరకు శ్రీవారి వాహన
సేవలు తిరుమల నాలుగు మాడ వీధుల్లో టీటీడీ వారు నిర్వహిస్తున్నారని, గరుడ సేవ
రోజున సుమారు 4 నుండి 5 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగతా
రోజుల్లో సుమారు రోజుకి ఒక లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, 3782
మందితో పోలీస్ సిబ్బందితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత ఏర్పాట్లు
చేయడం జరిగిందని వివరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మెదటి విడత
2622 మంది సిబ్బందితో బందోబస్తు, గరుడ సేవ రోజున అదనంగా మరో 1160 మంది
సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు.
గరుడసేవ రోజున అదనపు బలగాలతో మరింత పటిష్టమైన భద్రత చర్యలుచేపట్టామని, గరుడ
సేవ రోజు తిరుమలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. 21వ తేది మధ్యాహ్నం 12
గంటల నుండి అనుమతించబడవని చూడప్పారు. ఈ నెల18న శ్రీవారికి
ముఖ్యమంత్రిపట్టువస్త్రాలు సమర్పిస్తారని, తిరుమలలో అనుమానిత వ్యక్తులపై
నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుమలలో 32
పార్కింగ్ స్థలాలను గుర్తించి సుమారు 15000 వాహనాలు ను పార్కింగ్ చేయుటకు
వీలుగా చర్యలు తీసుకున్నామని, టూరిస్ట్ బస్సులు, తిరుమలకు అనుమతి నిరాకరించిన
(సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న టెంపో ట్రావెల్) వాహనాలకు జూ పార్క్ రోడ్ నందు
గల దేవలోక్ పార్కింగ్ ప్రాంతాన్నిఉపయోగించుకోవాలన్నారు. గరుడ సేవ రోజు
ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం అలిపిరి లింకు బస్సు స్టాండ్, పాత చెక్
పాయింట్, ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్
ప్రాంతాలు ఏర్పాటు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పోలీస్ శాఖ పని
చేస్తుందన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రెండు ఘాట్ రోడ్లు, తిరుమల పరిసర
ప్రాంతాలన్నింటిని స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడతారన్నారని, బాంబు
స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లు ఘాట్ రోడ్లు తిరుమల పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా
తనిఖీలు చేస్తాయన్నారు. ఈ తనిఖీలు నిరంతరం బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు
జరుగుతాయన్నారు. ఆక్టోపస్ సిబ్బంది కూడా తిరుమలలో ప్రత్యేక నిఘా తో పని
చేస్తారని తెలిపారు. తిరుమల లోని నాలుగు మాడవీధుల్లో శ్రీవారి
బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు గ్యాలరీలలో చేరుకున్న భక్తులు తొక్కిసలాట
జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్
పాయింట్లు వద్ద తగిన సిబ్బందిని నియమించి పటిష్ట చర్యలు, గరుడ సేవ రోజున
టిటిడి నిర్ధేశించిన సమయానికి భక్తులను గ్యాలరీల లోకి అనుమతిస్తామన్నారు.
తిరుమల మొత్తం సీసీ కెమెరాలతో, పోలీసుల ఆధీనంలో ఉంటుందన్నారు. తమ సిబ్బంది
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు
సిబ్బందిని అప్రమత్తం చేస్తారన్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగినా ఆ ప్రాంతాలను
అప్పటికప్పుడే గుర్తించి తగు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా భక్తులకు
సౌకర్యార్థం 10 పోలీసు సబ్ కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందితో
పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి, చిన్న పిల్లలు,
మతిస్థిమితం లేని వారు, వయోవృద్దులు తప్పిపోకుండా జియో టాగింగ్ ఏర్పాటు చేసి
ఉన్నాము. సహాయం కొరకు పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు. శ్రీవారి
బ్రహ్మోత్సవాల్లో నేరాలను నియంత్రించేందుకు 220 మంది క్రైమ్ పార్టీ అధికారులు
సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటికే తిరుమలలోని పలు ప్రదేశాలలో చైన్
స్నాచింగ్, జిప్ ఓపెనింగ్, బ్యాగ్ లిఫ్టింగ్ లాంటి నేర ప్రదేశాలను
గుర్తించారు. ఈ ప్రాంతాలలో వేలిముద్రలు, వ్యక్తి యొక్క మొహాన్ని గుర్తించేలా
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. పాత నేరస్తులను
గుర్తించ గలిగిన జిల్లాలు, ఇతర రాష్ట్రాల లోని సిబ్బందిని ఈ బందోబస్తుకు
ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు.