‘ఖుషి’ విజయాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఎంపిక చేసిన 100 కుటుంబాలకు రూ.
లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. దీనికి
సంబంధించిన చెక్కులను ఆయా కుటుంబాలకు హైదరాబాద్ లో స్వయంగా అందించారు విజయ్.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. “నాకింత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి
కార్యక్రమాలు చేయాలని ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా సాయం
చేస్తే బాగుండనుకునే వాణ్ని. తమ్ముడి ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది
పడుతున్నప్పుడు ఎవరైనా కొంత డబ్బిస్తే బాగుండనిపించేది. కానీ, ఎవరిని
అడగటానికి ఇష్టముండేది కాదు. అవన్నీ దాటుకొని ఒక ఫ్యామిలీగా ఈ స్థాయికి
చేరుకున్నా. ఇవాళ మీకు సాయం చేయగలుగుతున్నా అంటే అది నా వ్యక్తిగత కోరిక. ఈ
చిన్న సాయం మీకు ఉపయోగపడితే అదే నాకు ఆనందం. ఈ కార్యక్రమం ప్రకటించినప్పటి
నుంచి 50వేలకు పైగా అప్లికేషన్ లు వచ్చాయి. కానీ, 100 మందికి మాత్రమే
ఇవ్వగలుగుతున్నా. ప్రతి ఏడాది మరికొందరికి సాయం చేస్తా. నేను సినిమాలు
చేస్తున్నంత కాలం మీకు అండగా నిలుస్తూనే ఉంటా” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర
దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాల్గొన్నారు.