వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లు,
వ్యాధులు సోకకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటో
చూద్దాం..
కాచి చల్లార్చిన నీరు:
వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీరు తాగడం చాలా మంచిది. ఎందుకంటే వానాకాలంలో
నీరు కలుషితం అవుతుంది. దీనివల్ల కాలేయం ఇన్ఫెక్షన్ లు వస్తాయి. అందుకే కాచి
చల్లార్చిన నీరు తాగడం మంచిది.
బయటి ఆహారం:
వర్షాకాలంలో బయటి ఫుడ్ తినడం మంచిది కాదు. బజ్జీలు, పానీపూరీ వంటివి కాలేయంపై
నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఈ ఆహారాలను దూరం పెట్టండి.
పండ్లు:
చాలామంది బయట ఫ్రూట్ సలాడ్లు తింటుంటారు. జ్యూస్ తాగుతుంటారు. ఇంట్లో కూడా సగం
కట్ చేసిన పండ్లు తింటుంటారు. అలా వదిలేసిన పండ్లపై ఈగలు, దోమలు, పురుగులు
చేరతాయి. దీనివల్ల పండ్లు కలుషితం అవుతాయి. ఇవి తింటే కాలేయ ఇన్ఫెక్షన్ లు
వస్తాయి.
వ్యాయామం:
కాలేయం ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించడం
చాలా అవసరం. దీనివల్ల విష పదార్థాలు చెమట రూపంలో బయటకు పోయి కాలేయం
శుభ్రమవుతుంది.
పరిశుభ్రత:
వర్షాకాలంలో ఎల్లపుడూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. బయట నుంచి వచ్చిన తర్వాత
కాళ్లు, చేతులు కడుక్కోవాలి. దీనివల్ల మీ కాళ్లు, చేతులకు ఉండే క్రిములు
నశిస్తాయి.
తినే ముందు
వర్షాకాలమే కాదు అది ఏ కాలమైనా భోజనం చేసేముందు, వంట చేసే ముందు చేతులు శుభ్రం
చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల కాలుష్య కారకాలు, సూక్ష్మ క్రిములు శరీరంలోకి
ప్రవేశించకుండా నివారించవచ్చు.
నిద్ర:
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర కూడా అవసరం. ప్రతిరోజూ కనీసం 8 గంటలు
నిద్రపోవడం. వల్ల మిగతా అవయవాలతో పాటు కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.
సమతుల్య ఆహారం:
కాలేయం ఆరోగ్యం కోసం వర్షాకాలంలో తినే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టడం అవసరం.
క్యారెట్, బీట్ రూట్, గింజలు, పండ్లు వంటివి కాలేయాన్ని
ఆరోగ్యంగా ఉంచుతాయి.