కొన్ని ఫ్రూట్స్ ఆ సమయంలో తినకపోవడమే మంచిది. అవేంటో చూద్దాం..
ద్రాక్ష
ద్రాక్షలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని రాత్రిపూట
పడుకునే ముందు మాత్రం అస్సలు తినొద్దు. ఈ పండ్లలోని సిట్రిక్ నేచర్ వల్ల
ఛాతిలో మంట వచ్చే అవకాశం ఉంది.
టొమాటో:
రాత్రిపూట పడుకునే ముందు టొమాటోలు తినడం వల్ల నిద్రపై నెగిటివ్ ప్రభావం
పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. టొమాటోల్లోని టైరమైన్ అనే అమైనో యాసిడ్
వల్ల మెదడు యాక్టివిటీ పెరిగి నిద్ర తొందరగా పట్టదు.
నారింజ:
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రాత్రిపూట తొందరగా
జీర్ణమవదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
పుచ్చకాయ
బాడీని హైడ్రేట్ చేయడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే ఈ పండ్లను రాత్రిపూట
తినడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి బాత్రూమ్ వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల
నిద్రభంగం కలుగుతుంది.
అరటి:
అరటి పండ్లు జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల రాత్రిపూట అరటి
పండ్లు తినడం మానుకోండి. ఇది కడుపు ఉబ్బరం వంటి సమస్య వస్తుంది. అయితే బరువు
పెరగాలనుకునే వారు రాత్రి అరటి పండు తినడం మంచిదే.
పియర్స్:
పియర్స్ పండ్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినడం చాలా మంచిది. అలాగే లంచ్‌లోకి కూడా
తినొచ్చు. కానీ వీటిలోని ఫైబర్ వల్ల రాత్రిపూట మాత్రం అస్సలు తినొద్దు.
జామ:
జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తొందరగా జీర్ణం కాదు. దీనివల్ల కడుపు
నొప్పి వంటి మస్యలు వస్తాయి. అలాగే నిద్ర కూడా సరిగా పట్టదు.
యాపిల్స్:
నిద్రకు కారణమయ్యే సర్కేడియన్ రిథమ్ పై యాపిల్స్ నెగిటివ్ ప్రభావం చూపుతాయి.
రాత్రిపూట యాపిల్స్ తినడం వల్ల డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం
ఉంది.