అమరావతి : స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లలో స్కిల్ డెవలప్ మెంట్ ఆఫ్
ఎక్స్‌లెన్సీ సెంటర్లు 6, ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్లు 36 వున్నాయని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ తెలిపారు. శనివారం
మీడియాతో మాట్లాడుతూ ఈ కేంద్రాలను సందర్శించడానికి వైసీపీ సిద్ధమా? అని
ప్రశ్నించారు. ఈ 42 సెంటర్ల సందర్శనకు వైసీపీ మంత్రుల్ని, శాసనసభ్యుల్ని,
సాక్షి మీడియాని, వైసీపీ అనుబంధ మీడియాని స్వాగతిస్తున్నామన్నారు. రండి కలిసి
పర్యటిద్దాం. అక్కడ ఉన్న వాస్తవాలను తెలుసుకుందామని అన్నారు. కేంద్రం ఇచ్చిన
సెంట్రల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లే లేవంటున్నవారు ఢిల్లీకి వచ్చి
నిర్ధారించుకోగలరా? అని నిలదీశారు. తమ సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి, ప్రేమ్
చంద్రారెడ్డిలతో కలిసి అన్ని సెంటర్లు తిరుగుదాం..రాగలరా అని సవాల్ విసిరారు.
ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం లేని అవినీతి గురించి ప్రచారం చేయడం, గందరళోళం
సృష్టించడం మానాలని బీద రవిచంద్ర హితవుపలికారు.