నుంచి రెండు రోజులపాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం
సిద్ధమైంది. విజయభేరి బహిరంగ సభ సైతం ఉండటంతో.. ఆ పార్టీ భారీ ఏర్పాట్లు
చేసింది. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన
వ్యూహంపైనా సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారు. జమిలి
ఎన్నికలపై ప్రచారం జరుగుతున్నందున దానిపైనా సమాలోచనలకు అవకాశం ఉంటుందని
తెలుస్తోంది.
హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ
అత్యున్నతవిధాన నిర్ణాయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సీడబ్ల్యూసీ భేటీకి
హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక
వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తరలిరానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో
కేంద్రం అనూహ్యంగా ఏదైనా కొత్త బిల్లు ప్రవేశపెడితే ఎలా ఎదుర్కోవాలో అనే
అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యమిస్తుందనే సందేశాన్ని..
ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతోనే సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో
నిర్వహిస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే
ఇలాంటి కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది తెలంగాణలో సమావేశంలో
నిర్వహిస్తుండటంతో అధిష్ఠానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం
చేసుకోవచ్చని సీనియర్ నేతలు చెప్పారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు
రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత
ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి,
పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఈ
సమావేశాలకు హాజరవుతారు.
“తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు, సమాన అభివద్ధి లేదు,
సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదని గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి
ఇక్కడ మూడు రోజులు ఉండి ఏఐసీసీ కార్యక్రమాలు పరిశీలిస్తారు. ప్రజలకు నమ్మకం
కలిగేలా 6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు. వాటిని 30 రోజుల్లో అమలు చేసే
బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తీసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి తెలిపారు.