నకిలీ ఓట్ల అంశం పై విచారణ చేయాలి
ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు చేసిన
వైయస్సార్సీపీ సీనియర్ నేత,మాజి మంత్రి పేర్ని నాని
గుంటూరు : రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు
కాలేదు,ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైయస్సార్సీపీ సీనియర్
నేత,మాజి మంత్రి పేర్ని నాని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్ర్టోరల్
ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలసి గురువారం వినతిపత్రం అందించారు. రాష్ర్టంలో
2014 నుండి 2019వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య
హెచ్చుతగ్గులకు సంబంధించి ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ
30,08,032 ఓట్లు ఓటర్ల జాబితాలో పెరిగాయని , 2019 నుంచి 2023 కాలంలో 38 వేల
ఓట్లు మాత్రమే తగ్గాయని పేర్కోన్న ఫిర్యాదులో వివరించారు.అదే విధంగా ఓటర్ల
వృధ్ది చూసినట్లయితే 2014-19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని 2019
నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలియచేశారు.
సిఇఓకి ఇచ్చిన ఫిర్యాదులో ఇంకా ఏముందంటే
గతేడాది కంటే 2023 సంవత్సరంలో నికర ఓట్ల సంఖ్య తగ్గింది.దీనిని బట్టి నకిలీ
ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ
ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించాలి. నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ
జరపాలి. 2014లో మొత్తం ఓటర్లు 3,68,26,744 కాగా 2019లో మొత్తం ఓటర్లు
3,98,34,776. 2014కు 2019కి మధ్య ఓట్ల తేడా 30,08,032(పెరుగుదల). 2019లో
మొత్తం ఓటర్లు 3,98,34,776, 2023లో మొత్తం ఓటర్లు 3,97,96,678. 2019కి 2023కి
మధ్య ఓట్ల తేడా 38,098(తగ్గుదల) ఉందని తెలియచేశారు.