రాజమహేంద్రవరం : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర
కారాగారంలో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌కు ఆయన సతీమణి
భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. వారానికి మూడుసార్లు
ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా తిరస్కరించడాన్ని తెలుగుదేశం పార్టీ
తప్పుబట్టింది.చంద్రబాబు అరెస్టు తర్వాత భువనేశ్వరి రాజమహేంద్రవరంలోనే
ఉంటున్నారు. ములాఖత్‌కు అనుమతి నిరాకరించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన
భర్తను అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం ములాఖత్పైనా అమానవీయంగా
వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అవాకాశం ఉన్నా,
కాదనడం సరికాదని ఆమె అన్నారు.

ఇదిలావుండగా చంద్రబాబు ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్
ఎస్.రాహుల్ నాలుగు రోజులు సెలవుపై ఉన్నారు. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకూ
ఆయన సెలవులో ఉంటారు. ఆయన భార్యకు అనారోగ్యం కారణంగా దగ్గర ఉండి చూసుకోవాల్సి
రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పెట్టారని ఉన్నతాధికారులు వివరించారు.
అయితే ఆయన స్థానంలో ఆ నాలుగు రోజులూ జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ
రవికిరణ్ జైలు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటారు. ప్రస్తుతం ములాఖత్ బెయిల్
పిటిషన్ తిరస్కరించిన ఈ రవికిరణ్ ఆర్థిక మంత్రి బుగ్గన అక్క కొడుకు అని
ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు తెలియాల్సి ఉంది.