గుంటూరు : చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన
అధికారులపై చర్యలు తప్పవని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర
హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 20 నెలలు విచారణ
చేశారు. కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని వారికి తెలుసు. కొందరు అధికారులకు
రాజకీయంగా పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
అధికారులు ఉద్యోగం వదిలి ఎక్కడ పోటీ చేసినా వారిని ఓడిస్తాం. ఉన్నతాధికారులకు
ఎంపీ పదవుల హామీ ఇచ్చినట్టు సమాచారం. గతంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్
అధికారులు జైలు పాలయ్యారు. జగన్ సహా అధికారులు బలి కావడం ఖాయం. తప్పు చేసిన ఏ
ఒక్క అధికారిని వదిలిపెట్టం. ఈడీ కేసులో చంద్రబాబు పేరు ఎక్కడా లేదు. కేసులో
చంద్రబాబు పేరు చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రలోభపెట్టారు. విజయసాయిరెడ్డి పుణె
వెళ్లి రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారు. కానీ కేసులో చంద్రబాబుకు సంబంధం
ఉన్నట్టు ఎవరూ చెప్పలేదని దూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.