ప్రజల కోసం జగనన్న ఆరోగ్య సురక్ష
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి అనకొండని, తవ్వే కొద్దీ ఆయన
స్కాంలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా గురువారం ఆయన పలు
అంశాలు వెల్లడించారు. చంద్రబాబు ఒక స్కిల్డ్, ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని
అన్నారు.ఈ ఎస్ ఐ లో స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, 118 కోట్లకు
లెక్క చెప్పని బాబు, అమరావతి అసైన్డ్ భూముల కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, పుంగనూరు
అల్లర్లు కేసు ఇలా చంద్రబాబు దురాగతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.
ప్రజల కోసం జగనన్న ఆరోగ్య సురక్ష : జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రజలకోసం మరో
మంచి కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. అనారోగ్య బాధితులను
చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థకు నాంది పలకనుందని అన్నారు. ఈనెల 15 నుంచి
వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపెయిన్ నిర్వహించనున్నారని,
రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి ఇల్లూ కవర్ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం
5 దశల్లో అమలు చేయనున్నట్లు, ఇందులో భాగంగా 7 రకాల పరీక్షలు ఉచితంగా
నిర్వహిస్తారని చెప్పారు.కార్యక్రమం అమలుపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశా
నిర్దేశం చేశారని తెలిపారు.