విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు ప్రగతిని సీఎంకు వివరించిన
అధికారులు
అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
మన బడి నాడు–నేడు పనులపై సీఎం సమీక్ష
అమరావతి : విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో
చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, ప్రగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక
విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు.
8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం
సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం
ఆదేశించారు. టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధపైనా సీఎం ఆరా తీశారు.
వారంలో మూడు రోజులపాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు
తెలిపారు. అనంతరం మన బడి నాడు–నేడు పనులపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు
ఖర్చుచేస్తున్నామన్నారు. ‘మెనూను మార్చి పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని
అందిస్తున్నాం. రాగిజావను కూడా ప్రవేశపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ
తగ్గకూడదు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ కూడా
పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్ అధికారులను
ఆదేశించారు.
మన బడి నాడు–నేడు పనులపై సీఎం సమీక్ష : చురుగ్గా రెండో విడత నాడు – నేడు పనులు
జరుగుతున్నాయని, ప్రతిమండలంలో రెండు జూనియర్ కాలేజీలు, అందులో ఒకటి
బాలికలకోసం పెట్టాలన్న సీఎం ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు
వివరించారు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 473 మండలాల్లో ప్రభుత్వ బాలికలు, కో
–ఎడ్యుకేషన్ కాలేజీలు. కేవలం రెండు మండలాల్లో బాలికలకు కాలేజీలు లేవు. 206
మండలాల్లో కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీలు లేవు. కేవలం బాలికలకోసం జూనియర్
కాలేజీలు ఉన్నాయని, అక్కడున్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా మార్చేందుకు
చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. జూనియర్ కాలేజీలుగా
మార్చడానికి గుర్తించిన హైస్కూళ్లతో జాబితాను రూపొందించామని, ఖరారు చేసిన
తర్వాత ఈ హైస్కూళ్లలో అవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, తదితర మౌలిక
సదుపాయాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఐఎప్పీ సహా అన్నిరకాల
సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని,
గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నామని, మెనూను మార్చి పిల్లలకు
రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, రాగిజావను కూడా
ప్రవేశపెట్టామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదని, నాణ్యతా
ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ కూడా పిల్లలకు అందిస్తున్న
ఆహారంపై పర్యవేక్షణ ఉండాలన్నారు. దీని వల్ల నాణ్యత ఎప్పటికీ నిలిచి ఉంటుందని,
ఈమేరకు ఎస్ఓపీ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో
బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలపై శ్రద్ధపెట్టాలని, వారికి మంచి
పౌష్టికాహారం, మందులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ
సమీక్ష లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్
రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధికశాఖ
కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్, పాఠశాల
విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, మిడ్ డే మీల్స్
డైరెక్టర్ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి ఎన్ దీవాన్ రెడ్డి,
ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.