అవ్వడంతో అనేక చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ వచ్చే ప్రమాదం
ఉంది.
సెబమ్:
సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు, సెబమ్ మృతకణాలతో కలిసి చర్మరంధ్రాల్లో
చిక్కుకుపోయినప్పుడు బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి.
హార్మోన్ల మార్పులు:
బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి మరో
ముఖ్య కారణం హార్మోన్ల మార్పులు యుక్త వయస్సులో ఉన్నవారిలో,
పీరియడ్స్ సమయంలో హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో బ్లాక్ హెడ్స్
వస్తాయి.
వివిధ రకాల మందులు:
వివిధ రకాల మందులు వినియోగించడంతో బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా
కార్టికోస్టెరాయిడ్స్, ఆండ్రోజన్ వంటి మందుల వాడకం బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి
కారణం.
అధిక మేకప్:
అధిక మేకప్ వేయడం, మేకప్ ను తొలగించుకపోవడం కారణంగా బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి.
కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన మేకప్ వినియోగించడంతో అనేక చర్మ సమస్యలు
వస్తాయి.
కెరాటిన్:
కెరాటిన్ ఉత్పత్తి సరిగా లేకపోయినప్పుడు సైతం బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి.
సాధారణంగా జుట్టు, చర్మం, గోళ్లు అందంగా మారేందుకు కెరాటిన్ సహాయపడుతుంది.
సిగరెట్ పొగ:
సిగరెట్ పొగ సైతం బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి కారణమే. పొగాకు నుంచి వచ్చే పొగ
చర్మ కణాల ఆనారోగ్యానికి కారణం అవుతుంది. ఇది బ్లాక్ హెడ్స్ సమస్యలకు కారణం
అవుతుంది.