‘కేజీఎఫ్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు కన్నడ
కథానాయకుడు యశ్. కానీ, ‘కేజీఎఫ్2’ విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నా ఇంత వరకు మరో
కొత్త చిత్రం ప్రకటించలేదు. అయితే ఇప్పుడాయన కొత్త సినిమా కబురు
వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన 19వ చిత్రాన్ని మలయాళ
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్
ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు
శరవేగంగా జరుగుతున్నాయని ఈ ఏడాది డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలు కానుందని
వార్తలు వినిపిస్తున్నాయి. గీతూ మోహన్ గతంలో ‘లయర్స్ డైస్’, ‘మూతన్’ సినిమాలతో
ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నారు.