ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే!
రాష్ట్రంలో 3,146 గిరిజన తండాలను గూడాలను గ్రామపంచాయతీలను చేసింది కేసీఆర్
మీ తండాల్లో మీ రాజ్యాన్ని స్థాపించింది టిఆర్ఎస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!
కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు
పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలంలో ప్రత్యేకంగా చేపట్టిన
తండాబాటలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణమంచినీటి
సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్ద వంగర (పాలకుర్తి నియోజకవర్గం) : రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్ద వంగర
మండలంలో తండా బాట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో పలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు గ్రామపంచాయతీ
నూతన భవనాలకు శంకుస్థాపన అలాగే సిసి రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
కొన్ని బీటీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ మంత్రి ఆయా తండాల్లో
పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ
పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం
దిద్ది, ఎడ్ల బండి పై ఊరేగిస్తూ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద వంగర
మండలంలోని ఎల్ బి తండా, బిసి (బంగారు చెలిమె) తండా, బొమ్మకల్ గ్రామ పంచాయతీ
పరిధిలోని కండ్యా తండా, ఔసలి తండాలు, ఆర్ సి (రెడ్డికుంట) తండా, మోత్యా
తండా, గంట్లకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని అమర్ సింగ్ తండా, రామోజీ
తండాలు, రాజమాన్ సింగ్ తండా, పడమటి తండాలలో మంత్రి పర్యటించారు. ఆయా
తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు ఒక్కో గ్రామానికి కోటి
రూపాయలతో అనేక అభివృద్ధి పనులతో సంక్షేమ కార్యక్రమాలతో గతంలో కనీవినీ ఎరగని
రీతిలో తండాలను సైతం గ్రామాలకు ధీటుగా అభివృద్ధి పరచిన ఘనత చరిత సీఎం కేసీఆర్
గారికి దక్కుతుందన్నారు. గిరిజనుల ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కెసిఆర్
ఎడబాపితే, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివృద్ధికి బి.ఆర్.ఎస్
ప్రభుత్వం పాటుపడుతుంటే, ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
పన్నుతోందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ ని నమ్ముకుంటే
నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని ప్రజలకు
పిలుపునిచ్చారు. అన్నదమ్ముల్లా కలిసి వున్న ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు
పెట్టడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతోంది. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల
కరెంటు చాలంటోంది. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల
బిఆర్ ఎస్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. ప్రజల్ని విభజించి పాలించే
కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ నేతలను మన నియోజకవర్గంలో కాలు
పెట్టనివ్వవద్దు. తరిమి కొట్టి మనల్నిమనం కాపాడుకోవాలి. మన కోసం
పాటుపడుతున్న సీఎం కెసిఆర్ కు, నాకు అండగా నిలవాలి. అని మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో సుఖాల్లో మీతో నేను
ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. ఈ
ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారు. మనమే ఎప్పటికీ ఇక్కడే ఉంటాం అని
ఆయన అన్నారు. మా తండాల్లో మా రాజ్యం అన్న గిరిజనుల కోసం 3,146 తండాలు గూడాలను
గ్రామపంచాయతీలుగా మార్చి వారి తండాల్లో గూడాల్లో వారి పాలనను కొనసాగిస్తున్న
ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ్రామాలకు దీటుగా తండాలను తాను
అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగాచేయడమేగాక,
ఒక్కో తండాకు కోటి రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు
వివరించారు. గిరి జిల్లా అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్
కి అండగా నిలవాల్సిన అవసరం ఉందని గిరిజనులకు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా
మంత్రిని ఆయా తండాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బతుకమ్మలు, కోలాట
నృత్యాలు, డప్పు వాయిద్యాలు, పూలు చల్లుతూ, తిలకం దిద్దుతూ స్వాగతించారు.
ఈ తండా బాట, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా తండాల ప్రజలు, స్థానిక
ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.