విజయవాడ : లండన్ పర్యటన ముగించుకొని సీఎం జగన్ దంపతులు ఏపీకి చేరుకున్నారు.
జగన్‌కు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంత్రులు, ఎంపీలు,
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు రన్ వేపై సీఎం
జగన్ మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి
ముత్యాలనాయుడు, మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, పినిపే
విశ్వరూప్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్
రెడ్డి, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం
సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి,
వల్లభనేని వంశీ కొలుసు పార్థ సారథి, మల్లాది విష్ణు, పలువురు ఎంపీలు,
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం
పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్ మార్గాన తమ నివాసానికి సీఎం జగన్
బయలుదేరారు. సీఎం రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పోలీస్ బందోబస్తుతో
కట్టుదిట్టం చేశారు.