జీవనశైలి కారణంగా చాలా మంది వెన్నుముక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
వెన్నుముకను ఆరోగ్యంగా మార్చే ఆహారాలేమిటో తెలుసుకుందాం..
ఆకుకూరలు:
పాలకూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు
సులభంగా అందుతాయి. వీటిని తీసుకోవడంతో వెన్నుముక ఆరోగ్యంగా మారుతుంది. ఇందులో
ఉన్న మెగ్నీషియం కండరాలను, నరాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్
ను తగ్గిస్తాయి.
బెర్రీస్:
వివిధ రకాల బెర్రీస్ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. బెర్రీస్ లో ఉండే
యాంటీఆక్సిడెంట్లు వెన్నుముకను బలంగా మార్చుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు
నరాలను బలంగా మార్చుతాయి. బెర్రీస్ రక్తప్రసరణను ఆరోగ్యంగా మార్చుతాయి.
క్యారెట్:
క్యారెట్ లో విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని బీటా కెరోటిన్
చర్మాన్ని, కళ్లను, వ్యాధినిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. క్యారెట్
వెన్నుముకను ఆరోగ్యంగా మార్చుతుంది.
ఫ్యాటి ఫిష్:
సాల్మన్, ట్యూనా వంటి చేపలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వెన్నుముకను
దృఢంగా మార్చుతాయి. వీటిలో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నరాలను ఆరోగ్యంగా
మార్చుతాయి. ఇందులోని సెలీనియం ఎముకలను బలంగా మారుతుంది.
నట్స్:
నట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నట్స్ తినడంతో శరీరానికి కావాల్సిన
పోషకాలు అందుతాయి. బాదం వంటి గింజల్లో కాల్షియం, సెలీనియం అధికంగా ఉంటుంది.
పాల ఉత్పత్తులు:
పాలు, ఇతర పాల ఉత్పత్తుల్లో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను
బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇవి నరాలను ఆరోగ్యంగా మార్చుతాయి. దీంతో
వెన్నుముక దృఢంగా మారుతుంది.
బీన్స్:
బీన్స్ లో ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి వెన్నుముకను
దృఢంగా మార్చుతాయి. క్రమం తప్పకుండా బీన్స్ తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా
మారుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్:
విటమిన్ సి కంటెంట్ ఉన్న పండ్లు ఎక్కువగా తినడంతో వెన్నుముక దృఢంగా మారుతుంది.
విటమిన్ సి వెన్నుముక గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఇది కొల్లాజెన్
ఉత్పత్తికి సహాయపడుతుంది.