సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు
వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన
వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు.
చంద్రబాబుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును
జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా మీడియాతో నిర్వహించిన చిట్
చాట్‌లో భాగంగా పై వ్యాఖ్యలు చేశారు.
ఎసిబి కోర్టులో చంద్రబాబుపై మరో పిటిషన్ వేసిన సిఐడి : టీడీపీ అధినేత
చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్ పిటిషన్ వేసింది. దీనిపై
న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మరోవైపు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు
వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబును
కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజుల
కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు అందులో పేర్కొన్నారు. విజయవాడ ఎసిబి
కోర్టులో టిడిపి అధినేత చంద్రబాబుపై సిఐడి మరో పిటిషన్ వేసింది. అమరావతి
ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్ (పీటీ
వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ
వారెంట్‌పై చంద్రబాబును విచారించడానికి కోర్టు అనుమతిని సిఐడి కోరింది. ఈ
కేసులో ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా నారాయణ, ఏ 6 గా నారా లోకేష్ ఉన్నారు.
చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో సిఐడి పిటిషన్లో పేర్కొంది