సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొంతమందిలో విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.
మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
డైట్:
నెలసరి సమయంలో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన డైట్ ను తీసుకోవడం ఎంతో
అవసరం. సరైన డైట్ తీసుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. పీరియడ్స్ నొప్పి
తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.
అరటి:
పీరియడ్స్ సమయంలో అరటిపండ్లు తినడం మంచిది. వీటిలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా
ఉంటుంది. ఇది శరీరంలో ద్రవసమతుల్యతకు సహాయపడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం
తగ్గుతుంది. ఇందులోని విటమిన్లు మూడ్ స్వింగ్స్ నీ తగ్గిస్తాయి.
స్ట్రాబెర్రీస్:
స్ట్రాబెర్రీ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు
అధికంగా ఉంటాయి. స్ట్రాబెర్రీస్ వాపును తగ్గిస్తాయి. రోగనిరోధకశక్తిని
మెరుగుపరుస్తాయి. బెర్రీస్ తినడంతో మలబద్దకం సమస్య దరి చేరదు.
నారింజ:
నారింజలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఐరన్ ను ఎక్కువగా
గ్రహిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో అలసట
ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నారింజ దూరం చేస్తుంది.
పైనాపిల్:
పైనాపిల్ లో బ్రోమలైన్ అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు
అధికంగా ఉంటాయి. ఇవి కండరాల ఒత్తిడిని తగ్గిస్తాయి. శారీరానికి కావాల్సిన
విశ్రాంతిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పీరియడ్స్ లో వీటిని
తింటే నొప్పి తగ్గుతుంది.
కివీ పండ్లు:
కివీ పండ్లలో విటమిన్ కె, ఈ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు
రక్తప్రసరణను మెరుగుస్తాయి. కివీ పండ్లు తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి
లభిస్తుంది.
నిమ్మ:
పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో నిమ్మ సహాయపడుతుంది. నిమ్మలో విటమిన్ సి
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది.
రక్తప్రసరణను ఆరోగ్యంగా మార్చతుంది. నిమ్మలోని పోషకాలు నొప్పిని తగ్గిస్తాయి.
బ్రకోలి:
బ్రకోలిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ నొప్పిని సులభంగా
తగ్గిస్తాయి. బ్రకోలిలో ఫైబర్, ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తాయి.