మెగా కోడలు అనేది చాలా పెద్ద బాధ్యతనే చెప్పాలి. ఏం చేసినా అభిమానులను
దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. లావణ్య త్రిపాఠి ఈ విషయంలో ప్రస్తుతం
ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం ఇటీవల జరిగిన
విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆమె సినిమాలు కూడా తగ్గించుకున్నారు. ప్రస్తుతం
తమిళ్ లో ఓ సినిమా మినహా ఆమె చేతిలో సినిమా లేమి లేవు. అయితే కొన్ని నెలల
క్రితం కథ నచ్చటంతో ఆమె ఓ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పారు. ‘స్కైలాబ్’ అనే
సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. కథ రీత్యా ఇందులో
కథానాయిక పాత్ర కాస్తంత బోల్డ్ గా ఉంటుందని తెలిసింది. పైగా ఇంటిమేట్
సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్ సిరీస్ దర్శక,
నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్ నీ చూసుకోమని చెప్పేశారట లావణ్య.
నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం
సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన వారంతా లావణ్య
నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.