‘లియో’ చిత్రంతో దసరా బరిలో నిలవనున్నారు కథానాయకుడు విజయ్. ఇప్పటికే ఈ
సినిమాని ముగించిన ఆయన తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రంపై దృష్టి
సారించారు. ఈ సినిమా పూర్వ శ్రీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి
తెలిసిందే. విజయ్ ఇందులో తన లుక్ కోసం యూఎస్ త్రీడీ స్కానింగ్ కూడా
చేయించుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు
చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు తొలివారం నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్టు
సమాచారం. నవంబరు నుంచి విజయ్ షూటింగ్ లో పాల్గొననున్నట్టు టాక్. యాక్షన్
థ్రిల్లర్గా ముస్తాబు కానున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు
ఇప్పటికే వార్తలొచ్చాయి.