వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్
జైలులో రిమాండ్గా ఉన్న చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ 7691పై
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సెటైర్లు
వేశారు. చంద్రబాబుకు ఇచ్చిన ఖైదీ నెంబర్ కూడితే 23 వస్తుందని, అంటే బాబుకు
2023 చివరి ఏడాది అని విమర్శించారు. 2024 నుంచి రాజకీయంలో ఆయన కనిపించరని
అన్నారు. దివంగత ఎన్టీఆర్ ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు మీకు అర్థం అయి
ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.