విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున
వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలోని
ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్
వేయనున్నారు. ఆయన దాఖలు చేసే పిటిషన్పై కాసేపట్లో విచారణ జరిగే అవకాశముంది.
గవర్నర్ను కలిసిన టీడీపీ నేతలు : టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ
కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను ఆదివారం అర్ధరాత్రి దాటాక
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు ఏపీ బంద్కు టీడీపీ
పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన
తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, పలు కూడళ్లలో ఆందోళనకు దిగారు.
చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను
పోలీసుల అదుపులోకి తీసుకుని పీఎస్లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ
నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్ను కలిశారు.