గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబుకు తన మద్దతు కొనసాగుతుందని జనసేన అధినేత
పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో గొడవ జరిగినప్పుడు చంద్రబాబు వచ్చి
మాకు మద్దతు తెలిపారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు. తిరిగి ఆ వ్యక్తి
కోసం నిలబడటం సంస్కారం. అందుకే చంద్రబాబుకు మద్దతు ఉంటుందని చెప్పానని పవన్
వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాజకీయాలను మరోస్థాయికి తీసుకెళ్లిందని
విమర్శించారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు
కుట్రలు చేస్తు్న్నారన్నారు. రాష్ట్ర ప్రజలు మేల్కొనాల్సిన సమయం
ఆసన్నమైందన్నారు. రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయని ఎప్పుడూ అనుకోవద్దు. కోనసీమ
జిల్లాల్లో వారాహి యాత్రపై దాడి చేసేందుకు 2వేల మంది నేరగాళ్లను దించారు.
కోనసీమ జిల్లాల్లో 50 మందిని చంపేయాలని పథకం పన్నారు. వైసీపీ మూకల కుట్ర
తెలిసి కేంద్ర పెద్దలు దాన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించే వారిపై హత్యకేసులు
నమోదు చేస్తున్నారు. తణకు, భీమవరంలో వారాహియాత్రపై దాడి చేసేందుకు
ప్రయత్నించారు.చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్పై వచ్చిన వాళ్లు సీఎం
కాలేరన్నారు. రాత్రి నన్ను పోలీసులు అడ్డుకున్నారు.. అప్పుడు నేనేం చేయాలి.
అందుకే నడి రోడ్డుపై కూర్చున్నా. వైసీపీ నేతలు యుద్ధం కోరుకుంటున్నారు. మద్య
నిషేధం అన్నారు. దానిపై డబ్బు సంపాదిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు.