చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు
చంద్రబాబు మీద ఇంకా ఏడు కేసులున్నాయి
పదేళ్లు శిక్ష పడుతుంది
రామోజికి కూడా ఇదే గతి
మా ప్రభుత్వం ధర్మాన్ని కాపాడే భాద్యత తీసుకొంది : రాజ్యసభ ఎంపీ విజయసాయి
రెడ్డి
న్యూఢిల్లీ : ఏపీ మాజీ ముఖ్యమంత్రికి రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు
ఇచ్చిన తీర్పుపై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ మా ప్రభత్వం
ధర్మాన్ని కాపాడే బాధ్యతను తీసుకుందని.. ఈరోజు చంద్రబాబు జైలుకు వెళ్లారు రేపు
రామోజీకి కూడా ఇదే గతి పడుతుందన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నేరానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన
తీర్పుపై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏ కుట్ర చేసినా
వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నాడని చట్టానికి
ఎవ్వరూ అతీతులు కారన్న విషయం ఈ రోజు అర్ధమై ఉంటుందని అన్నారు. చట్టానికి
అందరూ లోబడి పని చేయవల్సిందేనని చంద్రబాబు మీద ఈ ఒక్క కేసే కాదు ఇంకా ఏడు
కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఎలాగోలా వ్యవస్థలను మేనేజ్ చేసాడు ఇక
ఇప్పుడు కుదరదని ఈ కేసులో చంద్రబాబుకు తప్పకుండా పది సంవత్సరాలు జైలు శిక్ష
పడుతుందని తర్వాత రామోజికి కూడా జైలు శిక్ష తప్పదని అన్నారు. చంద్రబాబుపై
ఎటువంటి రాజకియ కక్ష లేదని అవినీతి చేసాడు కాబట్టే కోర్టు రిమాండ్ విధించిందని
దర్మాన్ని కాపాడే భాద్యత ఈ ప్రభుత్వం తీసుకొందన్నారు