ఉత్పత్తులు వాడి, వేల ఖర్చుపెట్టినా జుట్టు రాలడం సమస్యను
తగ్గించలేకపోతున్నారు. అయితే మెంతులతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. అది
ఎలాగో చూద్దాం..
కుదుళ్లకు పోషణ:
మెంతులు హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు
పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జుట్టు రాలడానికి చెక్:
జుట్టు రాలడాన్ని నివారించడంలోనూ మెంతులు సహాయపడతాయి. మెంతుల్లోని పోషకాలు
కుదుళ్లకు బలాన్ని ఇచ్చి వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తాయి.
చుండ్రు రాకుండా:
కుదుళ్లలో ఇన్ఫెక్షన్ కారణంగా చుండ్రు ఏర్పడుతుంది. అయితే మెంతులు ఉపయోగించడం
వల్ల చుండ్రుతో పాటు కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవచ్చు.
బట్టతలకు చెక్:
నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి
అరగంట సేపు ఉంచాలి. తర్వాత షాంపూతో కడిగితే బట్టతల నివారించవచ్చు.
జుట్టు తెల్లబడటం:
మెంతుల్లోని ప్రోటీన్స్, నికోటినిక్ యాసిడ్ జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి.
వీటిని ఉపయోగించడం వల్ల వెంట్రుకులు నల్లగా, మెరిసేలా ఉంటాయి.
జుట్టు మెరిసేలా:
మెంతి గింజలను నీళ్లలో కాసేపు మరిగించి వడకట్టాలి. ఈ నీటిని చల్లారిన తర్వాత
జుట్టు కడగడానికి ఉపయోగించాలి. ఇప్పుడు జుట్టు చిట్లడం తగ్గుతుంది. అలాగే
వెంట్రుకలు నల్లగా, మెరిసేలా మారతాయి.
ఇన్ఫెక్షన్స్:
మెంతి పొడిని పుల్లటి పెరుగుతో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీనిని జుట్టుకు
బాగా పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో తల కడిగితే చుండ్రు, ఇన్ఫెక్షన్
తగ్గుతుంది.
నెలపాటు:
4-6 వారాల పాటు ఇలా మెంతులను ఉపయోగిస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.
జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. కొత్త జుట్టు పెరుగుతుంది.