న్యూఢిల్లీ : జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దిల్లీ సమీపంలోని భారత వ్యవసాయ
పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) ప్రాంగణాన్ని ఆయా దేశాధినేతల జీవిత భాగస్వాములు
సందర్శించారు. వీరిలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి,
జపాన్ ప్రధాని సతీమణి యోకో కిషిద, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా
భార్య రీతూ బంగా తదితరులు ఉన్నారు. వారికి ఏఐఆర్ఐ ప్రాంగణంలో భారత విదేశీ
వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సతీమణి క్యోకో సాదరంగా స్వాగతం పలికారు.
కేంద్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రదర్శనను జీ20 ప్రథమ మహిళలు ఆసక్తిగా
వీక్షించారు. చిరు ధాన్యాలతో వంటకాల ప్రదర్శన, 15 వ్యవసాయ అంకుర సంస్థల అద్భుత
ఆవిష్కరణలు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, భారతీయ మహిళా సాగు
రత్నాలతో భేటీలను కేంద్ర వ్యవసాయ శాఖ నిర్వహించింది. గంటసేపు సాగిన సందర్శనలో
జీ 20 ప్రథమ మహిళలు భారతదేశ చిరు ధాన్య రాణి లహరి బాయితో కొద్దిసేపు
ముచ్చటించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా,
ఛత్తీస్గఢ్ తదితర 11 రాష్ట్రాలకు చెందిన 20 మంది మహిళా రైతులతో సమావేశం
నిర్వహించారు. బాస్మతీ బియ్యం రైతుల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.