బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ లోని అక్షర్‌ధామ్‌ను దర్శించుకుని
ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆదివారం ఉదయం అక్షర్ధామ్ ఆలయాన్ని
సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి అక్షతా
మూర్తి కూడా ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భారీ
బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సందర్శించనున్నట్లు సునాక్ శనివారం
సాయంత్రమే మీడియాకు వెల్లడించారు. హిందువుగా తాను గర్విస్తున్నానన్నారు. ఆ
సంస్కృతిలోనే తాను పెరిగానని తెలిపారు. తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు
సాంత్వననిస్తాయని వివరించారు. ఇటీవలే రక్షాబంధన్ నిర్వహించుకున్నట్లు
వెల్లడించారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు తనకు రాఖీలు కట్టినట్లు
చెప్పారు. జన్మాష్టమి జరపుకొనేందుకు తనకు సమయం లభించలేదన్నారు. ఆలయ దర్శనం
తర్వాత సునాక్ మహాత్మా గాంధీ స్మారకం రాజ్‌ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ
ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. జీ20 సదస్సు నిమిత్తం భారత్‌కు చేరుకున్న
దేశాధినేతలందరితో కలిసి సునాక్ గాంధీ మహాత్ముడికి నివాళులర్పించనున్నారు.
మరోవైపు సునాక్‌తో మోడీ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
చరిత్రాత్మకంగా నిలిచిపోయే రీతిలో సాధ్యమైనంత త్వరగా ‘స్వేచ్ఛా వాణిజ్య
ఒప్పందం’ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని ఇరు దేశాధినేతలు
నిర్ణయించారు.