విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు
తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో
409 సెక్షన్ పెట్టడం సబబు కాదన్నారు. ఆ సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన
సాక్ష్యం చూపాలన్నారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు.
దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. కేసులో చంద్రబాబు
పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు.
సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం
ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని, 24 గంటల్లోపు కోర్టులో
ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్
చేశామన్నారు.
చంద్రబాబు తరఫున వాదనలు వినిపించడానికి ఇద్దరికి మాత్రమే అవకాశం
టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు పినిపించడానికి
ముగ్గురికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇద్దరికి మాత్రమే
ఏసీబీ కోర్టు జస్టిస్ హిమ బిందు అవకాశం ఇచ్చారు. దీంతో సిద్ధార్థ లూధ్రా ),
పోసాని వెంకటేశ్వరరావు పేర్లు చెప్పగా న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఇంతమంది
లాయర్లు ఇక్కడ ఎందుకు వున్నారని జడ్జి ప్రశ్నించారు. స్వచ్ఛందంగా
వెళ్లిపోవాలని సూచించారు. 15 మందికి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. కాగా 409
సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా
మాట్లాడుతూ అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని అన్నారు. 409 పెట్టాలి
అంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్నారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని
కోరుతూ ఆయన ఈ మేరకు నోటీసు ఇచ్చారు. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి అవకాశం
కల్పించారు. ముందుగా రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ చేయాలని కోరుతూ సిద్ధార్థ
లూధ్రా వాదనలు వినిపిస్తున్నారు.