విజయవాడ : ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు అన్నారు. విజయవాడ
మంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్ల రూపాయలు
కేబినెట్ సెక్రటరీ ఆమోదం తెలపకుండా అర్జెంట్ ఫైల్ లో పెట్టి ఆమోదం తెలిపి
సీమన్స్ కంపెనీ ద్వారా డబ్బును డ్రా చేశారన్నారు. చంద్రబాబు ఈ తంతు
మొత్తాన్ని తన ఆధ్వర్యంలో అధికారులు వద్దన్నా కూడా బలవంతంగా అధికారులతో
చేయించారన్నారు. ఈ స్కాం మొత్తానికి సూత్రధారి, పాత్రధారి ప్రధాన నిందితుడు
చంద్రబాబు అని తేటతెల్లమైందన్నారు. అసలు ఈ స్కాం కి సీమన్స్ కంపెనీకి ఎట్టి
సంబంధం లేదు, అందులో ఒక ఎంప్లాయ్ ని పట్టుకుని మొత్తం కూడా ఈ స్కాం ని
నడిపించింది చంద్రబాబే అని మంత్రి అన్నారు.