విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా
ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్టుకుమార్ రాజు అన్నారు.
శనివారం ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం
ఏమిటి? అని ప్రశ్నించారు. బాబు పారిపోయే మనిషి కాదన్నారు. విచారణకు పిలవకుండా
డైరెక్ట్‌గా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తండ్రిని చూడడానికి
వెళ్తోతున్న లోకేశ్‌ను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు సభలకు
వస్తున్న ప్రజాదారణ చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఆయనను ప్రజల
వద్దకు వెళ్లనీయకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో
పవన్ కళ్యాణ్‌ను కూడా తిరగనీయవ్వలేదని, లోకేశ్ మీద కూడా దాడులు చేశారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తున్న అప్రజాస్వామిక పనులను ఆ పార్టీ నేతలు
కూడా తిట్టుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 25 అసెంబ్లీ స్థానాలు
కంటే మించి రావంటూ విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.