గుంటూరు : కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జనసేన అధినేత
పవన్ కల్యాణ్ ఆరోపించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం
వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండించడంతోపాటు ఆయనకు మద్దతు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్
మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలను కూడా చూపించకుండానే అర్ధరాత్రి వేళల్లో
అరెస్ట్ చేసే విధానాన్ని ఏపీలో అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత
ఏడాది విశాఖపట్నంలో జనసేనపై పోలీసు వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించిందో అందరూ
చూశారని చెప్పారు. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు
చేసి, అన్యాయంగా జైళ్లలో పెట్టారని దుయ్యబట్టారు. ఇప్పుడు నంద్యాలలో
చంద్రబాబును అరెస్ట్ చేసిన సంఘటన కూడా అలాంటిదేనని విమర్శించారు.